Hyderabad :కరోనా పై యుద్ధంలో అసువులు బాసిన వైద్య ఆరోగ్య శాఖ లోని కరోనా యోధులకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గతంలో పలుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘానికి గతంలో హామీ ఇచ్చిన విధంగా వైద్యులకు 50 లక్షలు, వైద్య సిబ్బందికి 25 లక్షలకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డి.హెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ , రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , రాష్ట్ర సెక్రటరీ జనరల్ డాక్టర్ దీనదయాల్ , రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ ఒక ప్రకటనలో కోరారు.* *వారు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ లో పని చేస్తున్న వారికి గుర్తింపుగా గతంలో ప్రత్యేక అలవెన్సు ఇచ్చిందని ఇప్పుడు దానిని పునరుద్ధరించాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు హామీ ఇచ్చిన విధంగా ఎమర్జెన్సీ హెల్త్ కేర్ అలవెన్సులు కనీసం 15 వేలుగా కొత్త పి ఆర్ సి లో విడుదల చేయాలని , కొత్త పి ఆర్ సి లో భాగంగా విడుదల చేయాల్సిన పీజీ ప్రత్యేక అలవెన్సులు కనీసం గా 10,000 వేలు ఉండాలని , అకడమిక్ అలవెన్స్ జీవోలు, రిస్కు అలవెన్సు ను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరారు.తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి టీకాలు వేశారని, ఇప్పుడు ప్రత్యేక కేటగిరి గా హై రిస్క్ గ్రూపులకు వేస్తున్నారని వారితో పాటు వైద్య ఆరోగ్య శాఖ లోని కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. వైద్యులు మరియు వైద్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రమోషన్లలో వైద్యులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి టైమ్ బౌండ్ ప్రమోషన్లు ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని గతంలో పలుమార్లు కోరినట్లు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు . తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం లీగల్ అధ్యక్షులు డాక్టర్ పల్లం ప్రవీణ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న వైద్యుల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం చర్చలకు పిలిచి పరిష్కరించాలని కోరారు. వీరి వెంట డాక్టర్ అజ్మీరా రంగా, డాక్టర్ వినోద్, డాక్టర్ బూపేందర్ సింగ్ రాథోడ్, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ అంబి శ్రీనివాస్, డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ ఆనంద్, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు*
ReplyForward |
No comments:
Post a Comment